కందుకూరులో నేడు రెండు గంటల పాటు పవర్ కట్

కందుకూరులో బుధవారం సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్ ఏఈ నరసింహం తెలిపారు. విక్కిరాలపేట రోడ్డులోని సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది. సంతోష్ నగర్, మక్కా మసీద్ పరిసరాలు, ప్రకాశం కాలనీ, రెవెన్యూ కాలనీ, వాసవి నగర్, ఆర్డీవో కార్యాలయం ప్రాంతం, మహాదేవపురం, కొండి కందుకూరు, బూడిదపాలెం, పాత బ్యాంకు బజార్, పెద్ద బజార్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ప్రభావితం కానుంది.

సంబంధిత పోస్ట్