కావలి రూరల్ సర్కిల్ సీఐగా ఏ. శివశంకర్ బాధ్యతల స్వీకరణ

కావలి రూరల్ సర్కిల్‌కు కొత్త సీఐగా ఏ. శివశంకర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు సర్కిల్ సీఐగా పనిచేస్తున్న పాపారావును వీఆర్కు పంపించినట్లు సమాచారం. బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద తమిళనాడుకు చెందిన బోట్లు విడిపించిన ఘటనలో సీఐపై ఆరోపణలు రావడంతోనే ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ బదిలీ జరిగిందని సమాచారం.

సంబంధిత పోస్ట్