కావలి రెడ్ క్రాస్ ను తనిఖీ చేసిన చైర్మన్

నెల్లూరు జిల్లా కావలిలోని రెడ్ క్రాస్ భవనాన్ని రాష్ట్ర ఛైర్మన్ రామారావు గురువారం తనిఖీ చేశారు. రక్త నిధి నిల్వ చేసే స్టోర్, రక్తం సేకరించే గదులు, తలసేమియా బాధితులకు అందిస్తున్న వసతులు, రికార్డులను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని రెడ్ క్రాస్ సంస్థల కన్నా కావలి రెడ్ క్రాస్ ఉత్తమంగా ఉందని రామారావు కొనియాడారు. నిర్వాహకులను ఆయన అభినందించారు.

సంబంధిత పోస్ట్