కావలి ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు "డయల్ యువర్ డిఎం" కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులు, ప్రజలు 9959225643 ఈ నంబర్కు కాల్ చేసి కావలి ఆర్టీసీ డిపో పై అభిప్రాయాలు, సమస్యలను తెలియజేయవచ్చని డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు కోరారు. కావలి, కలిగిరి, జలదంకి, కొండాపురం, దగదర్తి మండల ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.