కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అల్లూరులో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అధికారులతో సమీక్ష నిర్వహించి, అభివృద్ధి, పథకాల అమలుపై చర్చించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మండలం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే తెలిపారు.