కావలి: 20వ వార్డులో చెత్త డబ్బాలు పంపిణీ

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు, బుధవారం 20వ వార్డులో మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మూడు ప్లాస్టిక్ డబ్బాలు పంపిణీ చేశారు. వార్డు నాయకులు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో తడి చెత్త, పొడి చెత్త, రసాయన చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు ఈ డబ్బాలను అందజేశారు. ఈ కార్యక్రమంతో పరిసరాల పరిశుభ్రత మెరుగుపడి, ప్రజల్లో చెత్త వేర్పాటుపై అవగాహన పెరుగుతుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్