కన్జ్యూమర్ రైట్స్ ఫోరం ఉపాధ్యక్షుడిగా మేకపాటి మాల్యాద్రి నాయుడు ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మేకపాటి మాల్యాద్రి నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షుడిగా, సౌత్ జోన్ అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పదవి లభించింది. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, ధరల దోపిడీ, నాసిరకం వస్తువుల విక్రయాలపై పోరాడటం వంటి సామాజిక సేవలో మాల్యాద్రి నాయుడు చురుగ్గా పాల్గొంటున్నారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు కూడారి తిరుపాలు, కన్వీనర్ కదిరి వెంకట రంగారావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నిక శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ఉదయగిరి, కావలి ప్రాంతాలలో జరిగింది.

సంబంధిత పోస్ట్