ఇద్దరు కార్యదర్శులను సస్పెండ్ చేసిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్/ప్రిన్సిపాల్ సెన్సస్ ఆఫీసర్ వై. ఓ. నందన్, 2027 ఇంటింటి జనగణన సర్వేలో పాల్గొనకుండా, ఫోన్ కాల్స్‌కు స్పందించనందున సచివాలయ పరిపాలనా కార్యదర్శులు ఝాన్సీ లక్ష్మీ, సి. హెచ్. రాజశేఖర్ లను సస్పెండ్ చేశారు. సెన్సస్ విధులకు గైర్హాజరైన కమ్యూనిటీ ఆర్గనైజర్ పి. భవాని కి షోకాజ్ నోటీసు జారీ చేయబడింది. నగరపాలక సంస్థ కార్యాలయంలో అప్కాస్ సిబ్బందిగా పనిచేస్తున్న ఈ. రాజశేఖర్ మూడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వకపోతే సర్వీస్ నుంచి తొలగించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్