కొడవలూరు మండలం రేగడి చెలిక గ్రామపంచాయతీ పాలక వర్గానికి బుధవారం గ్రామ ప్రజల సమక్షంలో సచివాలయ సిబ్బంది ఘన సన్మానం నిర్వహించారు. గ్రామ సర్పంచి నల్లావుల శ్రీనివాసులు, ఉప సర్పంచి తక్కెళ్ళపాటి కళా కృష్ణ, వార్డు సభ్యులు చెముకుల సుకన్య, కటారి మహేశ్, దేవన బోయిన శ్రీహరి, నగళ్ళ లింగయ్య, రాచగిరి మమత, కట్ట పుల్లయ్య, తక్కెళ్ళపాటి సుబ్బరత్నమ్మ, యారం మమత, తలారి పద్మావతి లకు పంచాయితీ కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు.