డయల్ యువర్ ఎస్. ఈ. కార్యక్రమానికి 14 ఫిర్యాదులు

నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ దక్షిణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'డయల్ యువర్ ఎస్.ఈ' కార్యక్రమానికి జిల్లాలోని అన్ని డివిజన్ల నుండి మొత్తం 14 ఫిర్యాదులు అందినట్లు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. రాఘవేంద్రం తెలిపారు. రోడ్లు వేయడం వల్ల పోల్ ఎత్తు తగ్గడం, బార్బర్ షాప్‌లకు ప్రభుత్వ రాయితీ, త్రీఫేస్ కన్వర్షన్, మీటర్ రీడింగ్, లో వోల్టేజ్, వ్యవసాయ నూతన సర్వీసులు, గృహ విద్యుత్ సర్వీసులకు సంబంధించిన సమస్యలపై ఈ ఫిర్యాదులు వచ్చాయి.

సంబంధిత పోస్ట్