జిల్లాలో డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 271 డీజిల్ అవుట్‌లెట్లు ఉండగా, వాటిలో 40 షాపులలో స్వల్ప నిల్వలున్నాయని పేర్కొన్నారు. ప్రముఖ ఆయిల్ కంపెనీల యాజమాన్యాలతో చర్చలు జరిపామని, జిల్లాకు మంజూరైన 148 లోడ్ల డీజిల్‌లో 47 లోడ్లు సాయంత్రం 5 గంటలలోపు చేరుకుంటాయని తెలిపారు.