విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: డ్వామా పీడీ

విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నూతన డ్వామా పీడీ సివి. శ్రీనివాస ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం ఆయన జడ్పీ కార్యాలయ ప్రాంగణంలోని డ్వామా కార్యాలయంలో నూతన పీడీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన చాంబర్‌లో వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించి, వారి విధులు, పనితీరును అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు జిల్లా ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బందితో జూమ్ మీటింగ్ ద్వారా సమావేశమయ్యారు.

సంబంధిత పోస్ట్