సాయి బృందావనం లేఅవుట్ ను తనిఖీ చేసిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, మంగళవారం 1వ డివిజన్ దీన్ దయాళ్ నగర్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదును ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 2వ డివిజన్ గుడిపల్లి పాడు ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న సాయి బృందావనం లే అవుట్ ను సిటీ ప్లానర్ తో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్