నెల్లూరు నగరపాలక సంస్థ నూతన హెల్త్ ఆఫీసర్ గా డాక్టర్ ఓ. దినేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన డాక్టర్ కనకాద్రిని ఆయన మాతృ శాఖకు బదిలీ చేశారు. ప్రకాశం జిల్లా వాల్లేటి వారి పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్న దినేష్ ను ప్రభుత్వం ఈ పదవిలో నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ వైవో. నందన్ ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ను అందజేశారు.