భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం

ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని కొన్ని జిల్లాల్లో బలమైన గాలి, వర్షం నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశించారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, అంతరాయం లేని విద్యుత్ సరఫరా లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే, పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసరుగా నియమించినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్