పర్యావరణ పరిరక్షణకు సమగ్ర కార్యాచరణతో పనిచేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులకు సూచించారు. మంగళవారం ఉదయం నెల్లూరు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి అటవీ, వన్యప్రాణి పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసి అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ రవాణాను కట్టడి చేయాలని ఆదేశించారు. నగరవనాల నిర్వహణ, వనరుల సమీకరణపై కూడా చర్చ జరిగింది.