మరణించిన పోలీసుల కుటుంబాలకు కోట్ల ఎక్స్‌గ్రేషియా చెక్కులు

విధి నిర్వహణలో మరణించిన ఇద్దరు పోలీసు సిబ్బంది కుటుంబాలకు నెల్లూరు జిల్లా పోలీసు శాఖ బుధవారం భారీ ఎక్స్‌గ్రేషియా, బీమా చెక్కులను అందజేసింది. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల చేతుల మీదుగా ఏఆర్పిసి-797 రమేష్ బాబు కుటుంబానికి రూ. 1.12 కోట్లు, పిసి-2989 శివకుమార్ కుటుంబానికి రూ. 1.10 కోట్లు ఎస్బిఐ సహకారంతో అందించారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన అన్ని ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్