నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి డెవలప్మెంట్ కమిటీ కోఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు సూచించారు. ఈ మేరకు ఆయన నెల్లూరు జీజీహెచ్ లోని తన చాంబర్లో శానిటేషన్ సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పారిశుధ్య నిర్వహణలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, మొత్తం 210 మంది సిబ్బంది విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.