నెల్లూరు నగరంలో అమూల్య ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పోతురాజు టోనీ బాబు ఆధ్వర్యంలో జేమ్స్ గార్డెన్‌లో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జేమ్స్ గార్డెన్‌కు చెందిన కుటుంబాలు పాల్గొని, పలు విషయాలపై చర్చించాయి. నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత, క్రిమినల్ లాయర్ జాన్సీ ముఖ్య అతిథులుగా హాజరై, పలు మంచి విషయాలను తెలియజేశారు. అంతకుముందు, నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో జేమ్స్ గార్డెన్ వెల్ఫేర్ అసోసియేషన్‌ను కమిషనర్ నందన్ ప్రారంభించారు.