ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జులై 1వ తేదీన చిల్లకూరు మండలం, పొన్నపరవారిపాలెం లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో, అధికారులందరు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సోమవారం, కలెక్టర్ హిమాన్షు శుక్లా, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, ఎస్పి అజిత వేజెండ్ల, జేసి మొగిలి వెంకటేశ్వర్లు లతో కలిసి పున్నపువారిపాలెంలో ఏర్పాట్లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్