శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని, దేవస్థానం ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నగరపాలక సంస్థ ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ దేవరకొండ సుజాత తెలిపారు. బుధవారం స్థానిక రంగనాయకులపేట దేవస్థానం మాడవీధిలో రథోత్సవం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా, నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించగా, టౌన్ ఏ. ఎస్పి దీక్ష ఐ. పి. ఎస్. పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.