నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై. ఓ. నందన్ ఆదేశాల మేరకు, ఆరోగ్యాధికారి డాక్టర్ ఓ. దినేష్ నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. హోటల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డికి చెందిన అమరావతి హోటల్లో తనిఖీలు చేయగా, ఫ్రోజెన్ చికెన్, మటన్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. దీనితో హోటల్ యాజమాన్యానికి నోటీసు జారీ చేయాలని, జరిమానా విధించాలని సానిటరీ ఇన్స్పెక్టర్ కు కమిషనర్ ఆదేశించారు. ఈ తనిఖీల్లో సానిటరీ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.