నెల్లూరు: మస్టర్లను తనిఖీ చేసిన నగర మేయర్

నెల్లూరు నగరంలోని 42, 48, 49, 50 డివిజన్లకు సంబంధించి ఓల్డ్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 5 గంటలకు ఇంచార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ మస్టర్లను తనిఖీ చేశారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న మేయర్, సమర్థవంతంగా పనిచేసే జెంట్స్, ఉమెన్స్ విభాగాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్