నెల్లూరు: వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, సోమవారం 14వ డివిజన్ వేప దరువు ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ పనులను పర్యవేక్షించారు. స్థానిక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును పరిశీలించి, తాగునీటి సరఫరా విధానం, నీటి స్వచ్ఛతను తనిఖీ చేశారు. ట్యాంకును శుభ్రం చేసే వేళల రిజిస్టర్ ను క్రమం తప్పకుండా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కర్తం ప్రతాపరెడ్డి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్