నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, మంగళవారం 17వ డివిజన్ గుండ్ల పాలెం ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న లేఅవుట్‌ను టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. డ్రైన్లు, కనెక్టింగ్ రోడ్ల నిర్మాణ నాణ్యతను ఆయన తనిఖీ చేశారు. లేఅవుట్ నిర్వాహకులకు అనుమతులు, ప్లాన్‌తో పాటు పలు సూచనలు జారీ చేశారు.