నెల్లూరు: పాఠశాలను తనిఖీ చేసిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ శుక్రవారం స్థానిక వెంగళరావు నగర్ తాతయ్య బడి మున్సిపల్ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, హాజరు, మధ్యాహ్న భోజన సదుపాయం తదితర అంశాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, తరగతి గదులు, విద్యా ప్రమాణాలు, బోధన విధానం, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, క్రీడా మైదానం పరిశీలించి ప్రధానోపాధ్యాయునికి వివిధ సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్