నెల్లూరు: నక్ష ప్రాజెక్ట్ పనితీరును తనిఖీ చేసిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలో జరుగుతున్న నక్ష ప్రాజెక్టు కార్యక్రమాన్ని కమిషనర్ వై. ఓ నందన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాజెక్టు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా నిర్వహించి, నగరవ్యాప్తంగా అన్ని భవనాలను నిర్దేశించిన సమయంలోపు మ్యాపింగ్ చేయించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను, వార్డు ప్లానింగ్ సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్