నెల్లూరు: ఉడిపి హోటల్ ను తనిఖీ చేసిన కమిషనర్

నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ బుధవారం నగర పర్యటనలో భాగంగా మాగుంట లే అవుట్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఉడిపి హోటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హోటల్లోని వంటశాల, ఉపయోగించే నూనెలు, కిచెన్ ప్రాంతం, ప్రాంగణంలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులను పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, పరిసరాల మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణను క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేపట్టాలని హోటల్ నిర్వాహకులకు కమిషనర్ సూచించారు.

సంబంధిత పోస్ట్