దిత్వా తుఫాను కారణంగా నెల్లూరు నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, నగర పాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ సోమవారం రాత్రి నగరంలోని వివిధ ప్రాంతాలలో డ్రైనేజీ కాలువల ప్రవాహాన్ని పర్యవేక్షించారు. గాంధీ బొమ్మ, వి. ఆర్. సి, రామలింగాపురం అండర్ బ్రిడ్జి వంటి ప్రధాన ప్రాంతాలలో అర్ధరాత్రి పర్యటించి, డ్రైనేజీ కాలువల నిర్వహణ తీరును ఆయన తనిఖీ చేశారు. జనజీవనానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.