నెల్లూరు: బకాయి దారులతో మాట్లాడిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, మొండి బకాయిదారుల నుంచి పన్ను వసూళ్లకు స్వయంగా శనివారం రాత్రి శ్రీహరి నగర్ ప్రాంతంలో రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించారు. 2017 నుంచి రూ. 12 లక్షలు బకాయి ఉన్న సుభద్రా త్రిపాఠి, 2021 నుంచి బకాయి ఉన్న బద్వేలు శ్రీహరి రెడ్డిలకు సంబంధించిన ఖాళీ స్థలం పన్నుల గురించి వారితో మాట్లాడారు. పన్ను వసూళ్లలో అలసత్వంపై ఆయన అధికారులను మందలించారు.

సంబంధిత పోస్ట్