నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, డిఆర్ఓ విజయ్ కుమార్, ఆర్డీఓ అనూష, తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ఇతర అధికారులు అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.