నెల్లూరు: లంక దినకర్ ఈనెల 5న జిల్లాకు రాక

20 అంశాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ ఈనెల 5న జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మంగళవారం తెలిపారు. ఆయన 5న మధ్యాహ్నం 3.20 గంటలకు రైలులో బయలుదేరి సాయంత్రం 6.04 గంటలకు నెల్లూరు చేరుకొని గెస్ట్‌ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటారు. 6వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేస్తారు. ఏదైనా ఒక పిఎం శ్రీ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, మధ్యాహ్న పథకం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు.

సంబంధిత పోస్ట్