నెల్లూరు: మాతా శిశు మరణాలను పూర్తిగా నివారించాలి

జిల్లాలో మాతా శిశు మరణాలను పూర్తిగా నివారించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హై రిస్క్ గల గర్భిణుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారికి ఎప్పటికప్పుడు మెరుగైన వైద్య చికిత్స అందిస్తూ కాన్పు పూర్తయ్యే వరకు కూడా తల్లి బిడ్డ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ కనబరచాలన్నారు.

సంబంధిత పోస్ట్