నెల్లూరు,: పలు డివిజన్ లలో పర్యటించిన మేయర్

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ గురువారం 45వ డివిజన్ జేమ్స్ గార్డెన్ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ పనులను అధికారులు, సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. డ్రైన్ కాలువల పూడికతీత, సిల్ట్ వ్యర్ధాల ఎత్తివేత పనులను ఆమె పరిశీలించారు. దోమల నివారణ మందు పిచికారీ, ఫాగింగ్ ప్రక్రియలను క్రమంతప్పకుండా చేపట్టి దోమల నివారణకు నిరంతరం కృషి చేయాలని శానిటేషన్ విభాగాన్ని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్