నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ గురువారం 45వ డివిజన్ జేమ్స్ గార్డెన్ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. డ్రైన్ కాలువల పూడికతీత, సిల్ట్ వ్యర్ధాల తొలగింపు పనులను పరిశీలించి, దోమల నివారణకు ఫాగింగ్ ప్రక్రియలను క్రమం తప్పకుండా చేపట్టాలని శానిటేషన్ విభాగాన్ని ఆదేశించారు.