రెవెన్యూ సిబ్బంది తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని భూపరిపాలన ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. నెల్లూరు కలెక్టరేట్‌లో రెవెన్యూ సంబంధిత అంశాలపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోకి వెళ్లి పర్యటిస్తే ఎమ్మార్వోలు ప్రజల సమస్యలను త్వరగా గుర్తించి, మెరుగైన పరిష్కారాలు అందించగలరని ఆమె తెలిపారు.