నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో శానిటేషన్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. నగరంలో దోమల నివారణ చర్యలు, ఫాగింగ్, స్ప్రేయింగ్ కార్యక్రమాలు ఖచ్చితంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో 50 ఫాగింగ్ మిషన్లు, 160 స్ప్రేయర్స్, అదనంగా 5 పవర్ స్ప్రేయర్స్ పనిచేస్తున్నాయని తెలిపారు.