నెల్లూరు రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షులు బి. విజయ్ కుమార్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులతో, ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వి. శైలేంద్ర కుమార్ ఆధ్వర్యంలో వివిధ అంశాలపై చర్చించారు. పలు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.