నెల్లూరు రూరల్: 29వ డివిజన్ లో వరద నీరు వెళ్లేలా చర్యలు

మొంథా తుఫాను కారణంగా 29వ డివిజన్ మనమ సిద్ది నగర్ కాలువ కట్టపై ఉన్న ఇళ్లకు వెనుక భాగంలో ఉన్న ఇరిగేషన్ కాలువలోకి వరద నీరు భారీగా చేరింది. పూడికతో నీరు ముందుకు వెళ్లకుండా ఆటంకం ఏర్పడటంతో, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి, మంగళవారం జేసీబీతో యుద్ధ ప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గ్రీన్ అండ్ బ్యూటీఫికేషన్ కనపర్తి గంగాధర్, అస్లాం, దేవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్