నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ సోమవారం 46వ డివిజన్ బృందావనం ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఆసుపత్రులు, ప్రైవేట్ సంస్థలకు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ ఉండేలా చూడాలని, నూతన భవన నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు తప్పనిసరి అని, అనుమతులు లేని భవనాలను బి. పి. ఎస్ పథకం పరిధిలోకి తీసుకువచ్చి క్రమబద్ధీకరించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.