వెంకటాచలం వద్ద ఉన్న ఆర్టీసీ జోనల్ సిబ్బంది శిక్షణా కాలేజీ మరమ్మత్తులకు, గూడూరు బస్టాండ్ ఆధునీకరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నెల్లూరు జోన్ బోర్డు డైరెక్టర్ & జోనల్ చైర్మన్ ఎస్. సురేష్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఆర్.టి.సి. బస్టాండ్ లోని సమావేశ మందిరంలో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించారు.