నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో భవన నిర్మాణ సామాగ్రిని రోడ్లపై డంపు చేసి ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై మున్సిపల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వై. ఓ నందన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటుకలు, కంకర, ఇసుక వంటి సామాగ్రిని తరలించే లారీలు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు వంటి వాహనాల యజమానులు నగరపాలక సంస్థ నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.