నెల్లూరు: కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

డీఎస్సీ పరీక్షల్లో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వైసీపీ యువజన విభాగం నాయకులు సోమవారం కలెక్టర్‌కు వినతి పత్రం అందించేందుకు పీజీఆర్‌ఎస్‌కు వచ్చారు. కొందరిని లోపలికి అనుమతించకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తిక్కన ప్రాంగణంలో పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఉండటంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటనతో ప్రాంగణంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్