నెల్లూరు: ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటాం: సన్నపురెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నెల్లూరు రీజియన్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు విధి నిర్వహణలో మరణించడం పట్ల ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ఆయన మృతుల కుటుంబాలను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన ఉద్యోగులు నెల్లూరు టూ డిపో డ్రైవర్ వెంకయ్య (59) మరియు నెల్లూరు వన్ డిపో కండక్టరు రాఘవయ్య (56) నివాసాలకు వెళ్లి నివాళులర్పించి, వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్