రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారుల ద్వారా శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ వేదికలో టిడ్కో హౌసింగ్ 17, టిడ్కో హౌసింగ్ 11 ఫిర్యాదులు వచ్చాయి.