టపాసులు తయారు చేస్తే కఠిన చర్యలు : RDO అనూష

నెల్లూరులోని పొర్లు కట్ట సమీపంలో ఉన్న టపాసుల తయారీ గోడౌన్లలో ఆర్డీవో అనూష సోమవారం తనిఖీలు నిర్వహించారు. టపాసుల తయారీకి అవసరమైన అనుమతులు ఉన్నాయా లేదా అని ఆమె పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా టపాసులు తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంతపేట పోలీసులు కూడా పాల్గొన్నారు. స్టాక్ పాయింట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్