నెల్లూరు కార్పొరేషన్ రెవెన్యూ విభాగంలో ఎన్. కృష్ణ కిషోర్, సిహెచ్. కృష్ణంరాజు, ఎస్. అజయ్ లు ఇన్స్పెక్టర్లుగా నియమితులయ్యారు. వీరు గతంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. వీరి నియామకం నేపథ్యంలో, కార్పొరేషన్ లో పనులు వేగవంతమయ్యాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు ఇన్స్పెక్టర్లు బుధవారం మేయర్ రూప్ కుమార్ యాదవ్ ను కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.