తాగునీటి సరఫరాను పరిశీలించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, శనివారం 35వ డివిజన్ లేక్ వ్యూ కాలనీలో మెగా వాటర్ వర్క్స్ ఇంజనీర్లు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పారిశుధ్య నిర్వహణ పనులను పర్యవేక్షించారు. తాగునీటి సరఫరా ప్రణాళికాబద్ధంగా జరిగేలా, లీకేజీలు, వృధాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తాగునీటి నాణ్యత పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించి, నివేదికలు అందించాలని ఆదేశించారు. అనంతరం, ఆయన స్వయంగా తాగునీటి పరీక్ష నిర్వహించి ఫలితాలను విశ్లేషించారు.

సంబంధిత పోస్ట్