పీ4 పథకం అమల్లో భాగంగా జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలను తిరిగి పునఃధృవీకరణ చేసేందుకు ఈనెల 15 నుండి 25వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. నెల్లూరులో గురువారం ఆయన మాట్లాడుతూ జీరో పావర్టీ ఇనిషియేటివ్‌లో భాగంగా, ప్రభుత్వం గత మార్చి నెలలో పీ4 సర్వే నిర్వహించి జిల్లా వ్యాప్తంగా గృహాలను గుర్తించిందన్నారు.