నెల్లూరు జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్ష: రైతులకు ఘాట్ రోడ్డు హామీ

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం సమీక్షించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా బండగానిపల్లి ఘాట్ రోడ్డు నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సోమశిల ఉత్తర కాలువ విస్తరణ, వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. గండిపాలెం ప్రాజెక్టు లస్కర్ల జీతాల సమస్య పరిష్కారం, సాయిపేట, నందిపాడులలో నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటు, నిరుపేదల ఇళ్ల స్థలాల్లో మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్